TS Schools 2nd spell Badi Bata Schedule-Day wise Programmes, Activities, Guidelines 2017

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం షెడ్యూల్:
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది పాఠశాలల ప్రారంభంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీగా విద్యార్థులను చేర్చడం కోసం జూన్ 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  చదువు మధ్యలో మానేసిన వారు, బాలకార్మికులు, బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పిస్తారు. ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను పాఠశాలలో చేర్పించనున్నారు. 

1st day: మొదటి రోజు అంటే జూన్ 13 మన ఊరు మన బడిబాట సర్వే గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఉపాధ్యాయులు చదువుకునే వయస్సులో ఉన్న వివరాలు సేకరించి బడికి వెళ్లని విద్యార్థులు గ్రామ విద్య రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేలా తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి పిల్లలను చేర్చుకుంటారు. కర పత్రాలు, ప్రచారం నిర్వహిస్తారు.

2nd day: రెండో రోజు పిల్లల ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. దీనికి డీఎం అండ్ హెచ్‌వో సహాయంతో బడికి వచ్చే పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు, ఆధార్ కార్డుల సేకరణ చేస్తారు.

3rd day: మూడో రోజు బాలికల రోజుగా నిర్వహిస్తారు. కేజీబీవీల్లో విద్యార్థులను చేర్చేందుకు, అందులో కల్పిస్తున్న సౌకర్యాలు గురించి తల్లిదండ్రులకు వివరిస్తారు. చదువుకునే వయస్సులో ఉన్న ప్రతి బాలికలను పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులను అవగాహన కల్పిస్తారు.

4th day: నాలుగో రోజు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల, హరితహారం నిర్వహిస్తారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రం చేయడం, పాఠశాలలో హరిత హారం కింద నాటిన మొక్కలను రక్షించేందుకు నీరు పోసి కంచె ఏర్పాటు చేస్తారు. బడిబయట ఉన్న విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారా లేదా చూసి, రాకపోతే కారణాలు తెలుసుకుంటారు.

5th day: చివరి రోజు జూన్ 17న గ్రామాల్లో ఉన్న బాలకార్మికులను విడిపించి పాఠశాలలకు వచ్చేలా చూస్తారు. ఈ క్రమంలో ఎస్‌ఎమ్‌సీ, ఎన్‌జీవోల సహాయ సహకారాలు తీసుకుంటారు. చదువుకునే దశలో ఉన్న విద్యార్థులను పనుల్లో పెట్టుకోవద్దని ముందే వివరిస్తారు. ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి, ఎస్‌ఎంసీ సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిపై చర్చిస్తారు.
Posted in:
Top